మెదక్: రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీ టీచర్లు,ఆయాలను ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నాలో పాల్గొనకుండా ముందస్తుగా అంగన్ వాడీ టీచర్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు పోలీసులు. మెదక్ జిల్లా నిజాంపేటలో పలు గ్రామాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ఇందిరాపార్క్ ధర్నాకు వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు.. అంగన్ వాడీ టీచర్లు, ఆయాలను అరెస్ట్ చేసి నిజాంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మరోవైపు జగిత్యాల జిల్లాలో కూడా అంగన్ వాడీ టీచర్లు, ఆయాల అరెస్టులు కొనసాగుతున్నాయి. కోరుట్ల, మెట్ పల్లి లో అంగన్ వాడీ టీచర్లు, ఆయాలను ముందుస్తుగా అరెస్ట్ చేశారు పోలీసులు. అక్రమ అరెస్ట్ లను ఖండించారు అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు.. డిమాండ్ల సాధన కోసం పోరాటాలను అపలేరని అన్నారు.
హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద తమ డిమాండ్ల సాధనకోసం చేస్తున్న ధర్నా 23 వ రోజుకు చేరింది. కనీసం వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ధర్నా చేస్తున్నారు అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు. ధర్నా లో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళ్లకుండా అడ్డుకోవడం దారుణమన్నారు అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు. అక్రమ అరెస్టులను ఖండించారు.