ఫైర్ క్రాకర్స్ తో స్టంట్స్​ చేసిన ఇద్దరు అరెస్ట్​

ఫైర్ క్రాకర్స్ తో స్టంట్స్​ చేసిన ఇద్దరు అరెస్ట్​
  • ఆ వీడియో ఏడాది కిందటిదని తేల్చిన పోలీసులు.. రెండు రోజుల కిందే పోస్టింగ్​
  • ఐటీ కారిడార్​ రోడ్లపై బైక్​రేస్​లు, స్టంట్లు చేసిన వారిపై 15 కేసులు
  • 203 బైకులు, 3 కార్లు స్వాధీనం

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్​రోడ్లపై ఫైర్​క్రార్స్ తో బైకులపై స్టంట్లు వేస్తున్నట్లు సోషల్​మీడియాలో వైరల్​అయిన వీడియో పాతదని రాయదుర్గం పోలీసులు గుర్తించారు. రామాంతపూర్ కు చెందిన సమీర్​గతేడాది నవంబర్​లో బైక్​పై స్టంట్లు వేస్తూ వీడియో తీసుకుని ‘వండర్స్ స్పోర్స్’ అనే ఇన్​స్టాగ్రామ్​అకౌంట్​లో పోస్ట్​చేశాడు. ఆ వీడియోను షాబాజ్​అనే యువకుడు డౌన్​లోడ్​చేసుకుని ఇటీవల తన ఇన్​స్టా అకౌంట్​అయిన ‘ఎండీ షాబాజ్ ఖాన్46’లో పోస్ట్​చేసి వైరల్​చేశాడు. గుర్తించిన రాయదుర్గం పోలీసులు షాబాజ్, సమీర్ పై కేసు నమోదు చేశారు.

ఇద్దరిని అదుపులోకి తీసుకుని, స్టంట్లు వేసేందుకు వినియోగించిన బైక్​ను సీజ్ చేశారు. అలాగే ఐటీ కారిడార్ రోడ్లపై బైకులతో ప్రమాదకరంగా స్టంట్లు వేస్తూ, రేసింగ్స్ కు పాల్పడుతున్న వారిపై సైబారాబాద్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు మొత్తం 15 కేసులు నమోదు చేశారు. ఇందులో 203 బైకులను, 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనాలను ఆర్టీఏ అధికారులకు అప్పగించారు.