
- గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలో నల్లబెలూన్ల కలకలం
- కాంగ్రెస్ నేతల నేతృత్వంలో నల్లబెలూన్లు వదిలిన యువకులు
విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం పర్యటనలో నల్లబెలూన్లు కలకలం సృష్టించాయి. గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని ఓ బిల్డింగ్ మీద నుంచి కాంగ్రెస్ నేతలు బెలూన్లు వదిలారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ నేతృత్వంలో కొందరు యువకులు నల్ల బెలూన్లు వదిలారు. గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద ఆందోళన చేసిన కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మ శ్రీ, ఎమ్మార్పీఎస్ నేతలను అరెస్ట్ చేశారు.
ఈ వ్యవహారాన్ని పోలీసులు అత్యంత సీరియస్ గా తీసుకున్నారు. బెలూన్లు ఎగరవేయడాన్ని ప్రధాని భద్రతా పరంగా ఎస్ పీజీ అధికారులు సీరియస్ గా పరిగణించారు. ఇంటెలిజెన్స్ , ఎస్ బీ అధికారుల నిఘా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. బెలూన్లను ఎగరవేసిన స్థలానికి వెళ్లి పోలీసులు విచారణ చేశారు. దీనిపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామని రాష్ట్ర బీజేపీ నేతలు ప్రకటించారు.