భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సుభాష్ నగర్ వద్ద పోలీసులు దొంగ నోట్లతో కారులో వెళ్తునన్న ముఠాను పట్టుకున్నారు. కారును స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నారు. కారులో మూడు లక్షల పైగా ఒరిజినల్ నోట్లు, వాటితోపాటు కొన్ని లక్షల నకిలీ నోట్లు ఉన్నాయి. ఇల్లందు పోలీస్ ల అదుపులో ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులు.. సత్తుపల్లి మండలం వెంసూర్ కు చెందిన తనమళ్ళ రాజశేఖర్, కృష్ణాజిల్లాకు చెందిన బెరెల్లి రాంబాబు, కొత్తగూడెం చెందిన భాస్కర్ లుగా పోలీసులు గుర్తించారు.
అయితే ఈ నకిలీ ముఠా కొత్తగూడెం పోలీస్ స్టేషన్ సంబంధించినది. అక్కడి పోలీసులు ఇచ్చిన సమాచార మేరకు ఇల్లందు పోలీసులు పట్టుకొని ప్రాథమికంగా విచారణ జరిపారు. అనంతరం నిందితులను కొత్తగూడెం పోలీస్ స్టేషన్ కు తరలించారు.