వీడు మాములోడు కాదు.. ఎంబీబీఎస్ చదవకుండానే డాక్టర్ అయిపోయాడు.. డాక్టర్ అని పేరు చెప్పుకుని తిరిగితే పర్వాలేదు.. ఏకంగా క్లినిక్ పెట్టాడు.. అందులో నకిలీ డాక్టర్ సర్టిఫికెట్ ఫ్రేమ్ పెట్టాడు.. అంతేనా.. ఐదేళ్లుగా జనానికి ట్రీట్ మెంట్ కూడా ఇస్తున్నాడు.. ఇదెక్కడో మారుమూల గ్రామంలో అయితే ఎవరూ చూడటం లేదు.. ఎవరికీ తెలియదు అనుకోవచ్చు.. ఈ నకిలీ డాక్టర్ క్లినిక్ నడుపుతున్నది హైదరాబాద్ సిటీలో.. పోలీసుల పట్టుకునే వరకు వెలుగులోకి రాని ఈ దగుల్బాచీ డాక్టర్ కథ ఏంటో పూర్తి తెలుసుకుందాం.
Also Read :- మున్సిపల్ కమిషనర్కు హైకోర్టు నోటీసులు
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉప్పల్ లో నకిలీ వైద్యుడు భిక్షపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పల్ అన్నపూర్ణ కాలనీ మండే మార్కెట్ లో ప్రయివేటు క్లినిక్ నడుపుతున్నాడు భిక్షపతి. ఎంబీబీఎస్ పేరుతో మణికంఠ పాలీ క్లినిక్ పెట్టి ఐదేళ్లుగా జనానికి ట్రీట్ మెంట్ ఇస్తున్నాడు. ఎస్ఓటీ పోలీసుల తనిఖీలు చేయగా ఈ ఫేక్ డాక్టర్ భాగోతం బయటపడింది. అసలు అతను ఎంబీబీఎస్ చదవకుండానే లైసెన్స్ లేకుండా క్లీనిక్ నడుపుతున్నాడని విచారణలో తేలింది. దీంతో ఫేక్ డాక్టర్ భిక్షపతిని SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఉప్పల్ పోలీసులు.
ఈ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ వైద్యులు ఎక్కువవుతున్నారు. డాక్టర్ చదవకుండానే క్లీనిక్ లు పెట్టి వైద్యం చేయిస్తున్నారు.వచ్చీ రానీ వైద్యం చేస్తూ పేద ప్రజల ప్రాణాలు తీస్తున్నారు.