నేరేడుచర్ల, వెలుగు : గంజాయి అమ్ముతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హుజూర్నగర్ సీఐ చరమందరాజు వివరాల ప్రకారం.. నేరేడుచర్ల పట్టణంలోని మల్లికార్జున రైస్ మిల్లు వెనుక ఉన్న వెంచర్ లో గంజాయి అమ్ముతున్నారనే సమాచారం మేరకు శనివారం రాత్రి ఎస్ఐ రవీంద్రనాయక్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 100 గ్రాముల గంజాయి, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
దామరచర్ల యాదాద్రి దర్మల్ పవర్ ప్లాంట్ లో పనిచేస్తున్న బీహార్ రాష్ట్రం లక్ష్మీపూర్ కు చెందిన రామచంద్ర మహార్(46), ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భజింతపూర్ గ్రామానికి చెందిన సునీల్ ప్రసాద్(24), మేళ్లచెర్వు మండలం హేమ్లా తండాకు చెందిన ధరావత్ ముఖేశ్(28), పాలకవీడు మండలం మీగడంపాడు తండాకు చెందిన మాలోతు సంతోష్(22), మఠంపల్లి మండలం మంచ్చితండాకు చెందిన రూపావత్ సాయికుమార్(19)ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.