నాసిరకం ఆటోమొబైల్స్ స్పేర్ పార్ట్స్కు బ్రాండెడ్​ లేబుల్స్.. ఐదుగురు అరెస్ట్

హైదరాబాద్ : నాణ్యత లేని ఆటోమొబైల్స్ విడిభాగాలను విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. హోండా, హీరో, బజాజ్ కంపెనీలకు చెందిన నకిలీ లేబుల్స్ను అతికించి.. బైక్​లకు సంబంధించి డూప్లికేట్ స్పేర్ పార్ట్స్ అమ్ముతున్న గ్యాంగ్​ను మేడ్చల్ జోన్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు నిందితుల వద్ద నుంచి రూ.40 లక్షల విలువైన డూప్లికేట్ స్పేర్​పార్ట్స్​ను గుర్తించి సీజ్ చేశారు. 

రాజస్థాన్ లోని పాలి జిల్లాకు చెందిన గణపత్ కుమావత్ అనే వ్యక్తి 2008లో హైదరాబాద్ కు వలస వచ్చి.. మేడ్చల్ జిల్లా అల్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటున్నాడు. స్థానికంగా డైమండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ భాగ్యలక్ష్మి పేరుతో ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ షాప్ నిర్వహిస్తున్నాడు. తన బంధువులను కూడా హైదరాబాద్ కు పిలిపించి.. వారితోనూ సూరారం, బాచుపల్లిలో ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ షాప్ లు పెట్టించాడు.

ALSO READ :సీఎం కేసీఆర్కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ

ఢిల్లీలో తయారు చేసిన నాసిరకం స్పేర్ పార్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గణపత్ కుమావత్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకొచ్చేవాడు. హోండా, హీరో, బజాజ్ కంపెనీలకు చెందిన లోగోస్, హోలోగ్రామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్టిక్కర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డిజిటల్ ప్రింటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేవాడు. కస్టమర్స్ కు అనుమానం రాకుండా ఒరిజినల్ పార్ట్స్ తరహాలోనే ప్యాకింగ్ చేసేవాడు. తర్వాత వీటిని కింగ్ కోఠి, సికింద్రాబాద్​లోని ఆటోమొబైల్ హోల్ సేల్ షాపుల్లో అమ్మేవాడని డీసీపీ ఎస్వోటీ రషీద్ తెలిపారు. 

ఐదుగురు సభ్యుల గల ముఠా కొంతకాలంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 28 హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాపులతో పాటు సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లోని రెండు షాపులకు నకిలీ స్పేర్ పార్ట్స్ ను ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ చేస్తున్నాడు. ఈ దందాపై సమాచారం అందుకున్న మేడ్చల్ జోన్ ఎస్​వోటీ పోలీసులు గణపత్ కుమావత్​కు చెందిన ఆటో మొబైల్ షాపులపై దాడులు చేశారు. అతడితో పాటు పాటు డూప్లికేట్ స్పేర్ పార్ట్స్ అమ్ముతున్న  సురేష్ చంద్, శ్రవణ్ కుమార్, ఓంరామ్ నిమావాత్, రాజు రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నారు.