మహబూబ్‌నగర్ టౌన్, వెలుగు : పాలమూరులో కొన్ని రోజుల కింద వెలుగు చూసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల స్కాంలో మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఒకరు ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్వ్యక్తిగత కార్యదర్శి కొడుకు కాగా, మరొకరు కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్ఉన్నారు. ఈ కేసు వివరాలను శుక్రవారం మహబూబ్‌నగర్‌రూరల్ సీఐ రాజేశ్వర్‌గౌడ్ తెలియజేశారు. భగీరథ కాలనీకి చెందిన అరుణకుమార్రెడ్డికి న్యూ గంజ్‌కు చెందిన సిరాజుద్దీన్ ఖాద్రీ దివిటిపల్లి వద్ద డబుల్బెడ్రూమ్ఇప్పిస్తానని రూ.3.5 లక్షలు తీసుకున్నాడు. ఎంతకూ ఇల్లు ఇప్పించకపోవడంతో గురువారం ఫిర్యాదు చేశాడు. సిరాజుద్దీన్ ఖాద్రీ...అరుణ్‌కుమార్‌రెడ్డి నుంచే కాకుండా ఖాదర్అనే వ్యక్తితో కలిసి మరో ఇద్దరి నుంచి కూడా డబ్బులు వసూలు చేశాడు. ప్రస్తుతం ఖాదర్ పరారీలో ఉన్నాడు. సిరాజుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన దగ్గరి నుంచి రూ.2.50 లక్షలు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా కేంద్రంలోని పుట్నాలబట్టి ఏరియాకు చెందిన మరో బాధితుడు సుధాకర్ఇచ్చిన కంప్లయింట్మేరకు పట్టణంలోని ఆల్మాస్ఖాన్ వీధికి చెందిన వానగంటి ప్రకాశ్, బోయపల్లి గేట్ప్రాంతానికి చెందిన మహ్మద్ఇర్ఫాన్లపై కేసు నమోదు చేశారు. వీరు ఒకరికి డబుల్ బెడ్రూమ్ఇప్పిస్తామని రూ.2 లక్షలు, మరో ముగ్గురు నుంచి రూ.3 లక్షలు వసూలు చేశారు. హనుమాన్‌పురకు చెందిన మరో బాధితుడు సయ్యద్ కలాం పాషా ఇచ్చిన కంప్లయింట్మేరకు ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పని చేస్తున్న దేవేందర్ కొడుకు అక్షయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన బాధితుడి నుంచి రూ.30 వేలు, మరో వ్యక్తి నుంచి రూ.70 వేలు వసూలు చేసినట్లు తెలిపారు. వీరిని అరెస్టు రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.