కోట్లకు ఆశపడి క్షుద్రపూజలు ప్లాన్ చేశాడు.. చివరికి ఏమైందంటే..

కోట్లకు ఆశపడి క్షుద్రపూజలు ప్లాన్ చేశాడు.. చివరికి ఏమైందంటే..

కోట్లలో డబ్బుల వర్షం కురిపిస్తానని ఓ కేటుగాడు చెప్పిన మాటలు నమ్మి రూ. 2 లక్షలు సమర్పించుకొని మోసపోయాడు ఓ ప్రబుద్దుడు. మంచిర్యాలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. మంచిర్యాల పట్టణానికి చెందిన మాదంశెట్టి ప్రభంజన్ అనే వ్యక్తి కి క్షుద్రపూజలు చేస్తే కోట్లలో డబ్బులు వస్తాయని చెప్పి నమ్మించారు మోసగాళ్లు. మాయ మాటలు చెప్పి బాధితుడి నుండి 2 లక్షలు రూపాయలు వసూలు చేశారు ముఠా సభ్యులు. అమాయకుడి నుండి డబ్బు వసూలు చేసిన ముఠా క్షుద్రపూజల సెటప్ అంతా సిద్ధం చేసి శుక్రవారం ( జనవరి 24, 2025 ) రాత్రి 11 గంటల సమయంలో క్షుద్రపూజ మొదలుపెట్టారు. 

అయితే.. ఏమైందో ఏమో కానీ బాధితుడు ప్రభంజన్ కి పూజ మధ్యలో కేటుగాళ్లపై అనుమానం వచ్చింది.. తన రెండు లక్షల డబ్బులు తీసుకొని అక్కడి నుండి పారిపోవాలని అనుకున్నాడు.కాగా.. డబ్బుతో పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ప్రభంజన్ ను ముఠా సభ్యులు అడ్డుకొని చంపుతామని బెదిరించి డబ్బు లాక్కున్నారు.

ముఠా సబ్యులకు డబ్బులు ఇచ్చేసి అక్కడి నుండి పారిపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.