హైదరాబాద్ సిటీ, వెలుగు: అగ్గువకే బ్రాండెడ్లిక్కర్ అంటూ మద్యంప్రియులను మోసం చేస్తున్న ముఠా గుట్టు రటైంది. అమీర్‌పేట్ కృష్ణానగర్‌లో బుధవారం అనుమానాస్పదంగా కన్పించిన ఇద్దరిని హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు తనిఖీ చేయగా, వారి బ్యాగుల్లో 9 లిక్కర్ బాటిళ్లుబయటపడ్డాయి.
నిందితులను విచారించగా బ్రాండెడ్ మద్యం బాటిళ్లలో చీప్ లిక్కర్ నింపి అమ్ముతున్నట్లు తెలిపారు. వీరిచ్చిన సమాచారంతో మాదాపూర్అయ్యప్ప సొసైటీ సాయినగర్‌లోని ఓ ఇంట్లో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద చీప్ లిక్కర్నింపిన14 మద్యం బాటిళ్లు, 63 ఖాళీ సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను ఒడిశాకు చెందిన రుద్రాపత్రాప్ రౌత్, సత్యప్రకాశ్ రౌత్, రింకుజాన్, మనీశ్, పవన్‌గా గుర్తించారు. వీరంతా పలు ఈవెంట్లు, బార్ల నుంచి బ్రాండెడ్ ఖాళీ బాటిళ్లు, లేబుళ్లు, మూతలను సేకరిస్తున్నారు. వాటిల్లో చీప్‌లిక్కర్ నింపి రూ.25 వేలది డిస్కౌండ్పై రూ.16 వేలకు ఇస్తున్నామని మద్యంప్రియులను మోసం చేస్తున్నారు. ఈ కేసులో మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.