
నర్సంపేట, వెలుగు, వరంగల్ జిల్లాలో కస్టమర్ల డబ్బుతో ఆన్లైన్ గేమ్స్ఆడిన ఐసీఐసీఐ బ్యాంక్డిప్యూటీ మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సంపేట సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌లోని కరీమాబాద్‌కు చెందిన బైరిశెట్టి కార్తీక్ 2019 నుంచి నర్సంపేట ఐసీఐసీఐ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అప్పటి నుంచి గోల్డ్లోన్రెన్యూవల్, క్లోజింగ్ట్రాన్సాక్షన్స్చూసుకుంటున్నాడు.
అయితే నాలుగేళ్లుగా ఐదు పద్ధతుల్లో రూ.8.5కోట్లను తన బినామీ ఖాతాల్లోకి మళ్లించి క్రికెట్‌బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్ఆడుతూ వచ్చాడు. ఇటీవల బ్యాంకు నిల్వల్లో తేడా రావడంతో అధికారులు కార్తీక్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంక్వైరీలో 128 మంది కస్టమర్ల ఖాతాల నుంచి గోల్డ్లోన్ల డబ్బులను దారి మళ్లించినట్లు తేలింది. ఆడిట్ సమయంలో కస్టోడియన్, ఆడిటర్ల సంతకాలు సైతం ఫోర్జరీ చేసి క్లోజింగ్చూయించాడని సీఐ తెలిపారు. నర్సంపేట బస్టాండ్‌లో కార్తీక్‌ను అదుపులోకి తీసుకున్నామని, రిమాండ్‌కు తరలిస్తామని వివరించారు.