
హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా స్మగ్లర్స్ గుట్టు చప్పుడుగా అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్య గంజాయి అక్రమ రవాణా ఎక్కువయి పోయింది. అయితే దీంట్లో పురుషులే కాకుంగా మహిళలు కూడా రవాణా చేస్తూ పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది.
గురువారం (మార్చి 20) హైదరాబాద్ లో గంజాయి అక్రమ రావాణాలో భాగస్వాములైన అంతర్రాష్ట్ర మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గౌలిగూడలోని హనుమాన్ మందిరం బస్ పార్కింగ్ స్థలానికి సమీపంలో అంతరాష్ట్ర మహిళ గ్యాంగ్ అరెస్ట్ చేశారు పోలీసులు.
మహిళ గంజాయి రవాణదారుల నుండి రూ.2.45 లక్షల విలువగల 7కిలోల గంజాయి సీజ్ చేశారు. ఒడిశాకు చెందిన మహిళ గంజాయి రవాణదారులు జైజయతి తక్రి, గౌరీ జర, ధనర్జయా కిలా లను అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 7కిలోల గంజాయి, 3సెల్ ఫోన్స్, 7 వేల150 రూపాయల నగదు సీజ్ చేశారు పోలీసులు.