భూకబ్జాలపై పోలీసుల ఉక్కుపాదం.. కార్పొరేటర్ అరెస్ట్

కరీంనగర్ పట్టణంలోని భూకబ్జాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగా సీతారాంపూర్ 21 డివిజన్ కార్పొరేటర్ జంగిల్ సాగర్ ను అరెస్ట్ చేశారు. ఇప్పటికే మరో కార్పొరేటర్ తోట రాముడితో పాటు, బీఆర్ఎస్ నాయకుడు చీటి రామారావును కూడా అరెస్ట్ చేశారు. పోలీసుల జాబితాలో మరింత మంది కార్పొరేటర్లు, నాయకులు ఉన్నరని వెల్లడించారు.

ఫైనాన్షియల్ అఫెన్స్ స్, భూ ఆక్రమణలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులతో విచారణ వేగవంతం చేశామని.. కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మహంతి తెలిపారు.