తిరుమల కొండపై బెల్ట్ షాపు : గోవిందా ఏందయ్యా ఇది..!

తిరుమల కొండపై బెల్ట్ షాపు : గోవిందా ఏందయ్యా ఇది..!

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో  మద్యం,మాంసం అమ్మకాలు నిషేదించిన సంగతి తెలిసిందే.. అయినప్పటికీ కేటుగాళ్లు అడ్డదారిన తిరుమల కొండమీదకు మద్యం మాంసం తీసుకెళ్తున్న ఘటనలు అప్పుడప్పుడు వింటుంటాం. తాజాగా మరోసారి కలియుగ వైకుంఠం తిరుమల కొండపై మద్యం పట్టుబడటం కలకలం రేపింది. శనివారం ( మార్చి 29 ) తిరుమలలో మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

తిరుమలలో మద్యం విక్రయిస్తున్న రమేష్ అనే వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుండి మూడు మద్యం బాటిళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తిరుమలలో స్థానికులు నివాసం ఉండే బాలాజీ నగర్ లో ఎక్సైజ్ అదికారులు తనిఖీలు నిర్వహించిన పోలీసులు అక్రమంగా అమ్ముతున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ALSO READ | కార్యకర్తలకు హ్యాట్సాఫ్: స్థానిక సంస్థల ఉపఎన్నికలపై జగన్ ఎమోషనల్ ట్వీట్..

రమేష్ అక్రమంగా తిరుమలకు మద్యం తెచ్చి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.  తిరుమలలో ఎవరైనా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే ఇలాంటివారిని అస్సలు వదలకూడదని.. కఠినచర్యలు తీసుకోవాలని అంటున్నారు భక్తులు.