అయోధ్య రామాలయంలోకి స్పై కెమెరాతో ఎంట్రీ..గుజరాత్ వ్యాపారి అరెస్టు

అయోధ్య రామాలయంలోకి స్పై కెమెరాతో ఎంట్రీ..గుజరాత్ వ్యాపారి అరెస్టు

అయోధ్య:ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామమందిరంలోకి స్పై కెమెరాతో వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతడు గుజరాత్​లోని వడోదరకు చెందిన వ్యాపారవేత్త జానీ జైకుమార్ గా గుర్తించారు. 

భద్రత దృష్ట్యా అయోధ్య రామాలయంలో ఫొటోలు, వీడియోలు తీయడాన్ని  నిషేధించారు. ఈ రూల్​ను ఉల్లంఘించి ఫొటోలు తీసేందుకు స్పై కెమెరాతో లోపలికి ఎంటరయ్యాడు. కెమెరాలు అమర్చిన అత్యాధునిక కళ్లద్దాలతో గుడిలోకి ప్రవేశించాడు. 

సెక్యూరిటీ చెకింగ్ పాయింట్ల వద్ద వాటిని గుర్తించకుండా జాగ్రత్తపడ్డాడు. లోపలికి వెళ్లాక ఫొటోలు తీయడం ప్రారంభించాడు. ఆ సమయంలో కళ్లద్దాల చివరలో ప్లాష్ కనిపించడంతో భద్రతా సిబ్బంది జైకుమార్​ను అడ్డుకున్నారు. కళ్లద్దాలను తనిఖీ చేయగా అందులో కెమెరా ఉందని తేలింది.