యువతికి అబార్షన్‌ కేసులో పీఎంపీ అరెస్ట్‌

యువతికి అబార్షన్‌ కేసులో పీఎంపీ అరెస్ట్‌

గుడిహత్నూర్, వెలుగు: యువతికి అబార్షన్​ చేసిన కేసులో ఓ పీఎంపీని పోలీసులు అరెస్ట్  చేసి రిమాండ్​కు తరలించినట్లు ఏఎస్పీ కాజల్​ తెలిపారు. ఆదిలాబాద్  జిల్లా గుడిహత్నూర్‌ మండలం గురుజ గ్రామంలో ఈ నెల 11న వాగులో పసికందు డెడ్‌బాడీ లభించడం జిల్లాలో కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు శనివారం వివరాలను వెల్లడించారు. గురుజ గ్రామానికి చెందిన ఓ యువతి పెండ్లి కాకుండానే గర్భం దాల్చింది. 

ఆమె ఐదు నెలల గర్భం పోయేందుకు అదే మండలం మన్నూర్‌ గ్రామానికి చెందిన పీఎంపీ సూర్యవంశీ దిలీప్‌ను ఆశ్రయించింది. సదరు పీఎంపీ అబార్షన్​ కోసం టాబ్లెట్లను ఇచ్చాడు. ఆ తరువాత పసికందు డెడ్ బాడీని వాగులో పడేశారు. దీనిపై ఎంక్వైరీ చేసిన పోలీసులు అర్హతకు మించి వైద్యం అందించినట్లు తేలిందని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సంప్రందించి సదరు డాక్టర్‌పై మెడికల్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ యాక్ట్‌తో కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు.