ఏపీ కృష్ణాజిల్లాలో మైనింగ్ శాఖకు చెందిన రికార్డులను ధ్వంసం చేస్తున్నవ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెనమలూరు మండలంలోని యలమలకుదురు కరకట్టపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ సమీర్ శర్మ కారు డ్రైవర్ నాగరాజు రికార్డులను కాల్చేశాడు. మంటలను గమనించిన స్థానికులు... దీనిపై ప్రశ్నించగా కారులో ఉన్న సిబ్బంది పరారయ్యారు.
నాగరాజుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమీర్ శర్మ ఆదేశాలతోనే డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ లు గోను సంచుల్లో తీసుకొచ్చి ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.