ఓయూలో ఉద్రిక్తత: విద్యార్థుల అరెస్ట్..

ఓయూలో ఉద్రిక్తత: విద్యార్థుల అరెస్ట్..

ఓయూలో నిరసనలు, ఆందోళనలపై బ్యాన్ విధిస్తూ అధికారులు ఇచ్చిన సర్క్యులర్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు ఏబీవీపీ నాయకులు ఓయూ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. విద్యార్ధి సంఘాలు ఓయూ బంద్ కు పిలుపునివ్వడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో ఓయూ పోలీసులు ఏబీవీపి జాతీయ నాయకుడు జీవన్,హైదరాబాద్ సిటీ సెక్రటరీ పృథ్వి తేజని ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అక్రమంగా అరెస్టుల ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని.. యూనివర్సిటీ అధికారులు సర్క్యులర్ ను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని అన్నారు విద్యార్ధి నాయకులు.

ఈ క్రమంలో వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. నిరసనలు, ఆందోళనలపై బ్యాన్ విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని విద్యార్థి  సంఘాల డిమాండ్ చేశాయి.ఈ ర్యాలీలో ఐక్య విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థుల సంఘాల నిరసన చేపట్టాయి. ఈ క్రమంలో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేశారు పోలీసులు.