స్టెరాయిడ్స్ పట్టివేత.. ఒకరి అరెస్ట్

స్టెరాయిడ్స్ పట్టివేత.. ఒకరి అరెస్ట్

కంటోన్మెంట్, వెలుగు:  జిమ్ కు వెళ్లే యువతకు స్టెరాయిడ్స్​సప్లై చేసే వ్యక్తిని సికింద్రాబాద్​డ్రగ్స్​కంట్రోల్​ అధికారులు అరెస్టు చేశారు. అతని వద్ద వివిధ రకాల ఇంజక్షన్లు, టాబ్లెట్స్​స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.  డ్రగ్స్​ఇన్స్​స్పెక్టర్​గోవింద్​ సింగ్ తెలిపిన మేరకు.. కంటోన్మెంట్​పరిధి తాడ్​బండ్​లోని మసీద్ సమీపంలో ఉండే ఖాసీం(21) ఈజీగా డబ్బులు సంపాదించాలని ప్లాన్​చేశాడు.

జిమ్స్​లో వర్కవుట్ చేసే యూత్ ను టార్గె ట్​గా చేసుకుని స్టెరాయిడ్స్​సప్లై చేస్తున్నాడు. సమాచారం అందడంతో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు గురువారం ఖాసీం ఇంటిపై దాడి చేశారు. దాచి ఉంచిన కార్డియక్ స్టిమ్యులేటింగ్  డ్రగ్​ థెర్మిన్ ఇంజక్షన్లు, క్యాండీపేస్ -200 క్యాప్సుల్స్, పలు రకాల ట్యాబ్లెట్లు స్వా ధీనం చేసుకోగా.. వీటి విలువ సుమారు రూ.10వేలు ఉంటుందని డ్రగ్స్​ఇన్ స్పెక్టర్​ గోవింద్​ సింగ్ తెలిపారు.

ఖాసీంపై కేసు నమోదు చేశామని,  కోర్టు ఉత్తర్వులు అందగానే అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఖాసీం సప్లై చేసే ఇంజక్షన్లు హార్ట్ సర్జరీ, పలు రకాల సర్జరీల్లో రక్తం పలుచబడేందుకు వినియోగిస్తారని చెప్పారు. ఇలాంటి ఇంజక్షన్లు వాడడం ద్వారా గుండెపై తీవ్ర ఎఫెక్ట్ పడుతుందని, తద్వారా మరణిస్తారని పేర్కొన్నారు.