బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. అయితే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ముప్పు ఉందని పోలీసులు సెక్యూరిటీని పెంచారు. అయితే ఇటీవలే ముంబై కి చెందిన ఓ ట్రాఫిక్ పోలీస్ వాట్సాప్ కి సల్మాన్ ఖాన్ ని బెదిరిస్తూ మెసేజ్ వచ్చింది.
ఈ మెసేజ్ లో తమకి 5 కోట్లు ఇవ్వాలని, అలాగే లారెన్స్ బిష్ణోయ్ క్షమాపణలు చెప్పి ఈ గొడవని ముగించాలని, అలాగే ఈ మెసేజ్ ని తేలిగ్గా తీసుకోవద్దని ఉంది. దీంతో పోలీసులు ఈ విషయంపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో సల్మాన్ కి బెదిరింపుల మెసేజ్ పంపిన వ్యక్తిని పోలీసులు కర్ణాటక వ్యక్తిగా కనుగొన్నారు. ఇందులో భాగంగా పోలీసు బృందాలు వెళ్ళి ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు బయట పడ్డాయి. అయితే ఈ వ్యక్తికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కి ఎటువంటి సంబంధం లేదని కేవలం డబ్బుకోసమే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో మెసేజ్ చేసినట్లు విచారణలో తేలింది. ఆ తర్వాత పోలీసులకి క్షమాపణలు చెప్పాడు. దీంతో పలు సెక్షన్ల క్రింద ఈ వ్యక్తిపై కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.
Also Read : ఏంటీ.. పుష్ప 2 లో 5 నిమిషాల పాటకి రూ.5 కోట్లు డిమాండ్ చేసిందా..?
ఈ విషయం ఇలా ఉండగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ముప్పు ఎదుర్కుంటున్నప్పటి నుంచి సెక్యూరిటీ పెంచేశారు. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ హాజరయ్యే షూటింగ్ సెట్స్ లో కూడా పెద్ద మొత్తంలో సెక్యూరిటీ ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.