రూ. 50 లక్షలు ఎత్తుకెళ్లి ఐఫోన్లు కొన్న దొంగలు..ఐదుగురు అరెస్ట్

రూ. 50 లక్షలు ఎత్తుకెళ్లి ఐఫోన్లు కొన్న దొంగలు..ఐదుగురు అరెస్ట్

హైదరాబాద్‌ గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారిదోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నగదుతో పాటు..చోరీకి వినియోగించిన బైక్ స్వాధీనం చేసుకున్నారు. చోరీకి పాల్పడిన ప్రధాన నిందితుడు శ్రవణ్..గతంలో జ్యువెలరీ షాపులో పనిచేసినట్లు చెప్పారు టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర.చోరీ చేసిన డబ్బుతో ఐఫోన్లు కొన్నట్లు నిర్ధారించారు. 

గుడిమల్కాపూర్ పీఎస్ పరిధిలో వారం రోజుల క్రితం దోపిడీ  జరిగిందని టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపారు.  తిబర్మల్ జ్యువెలర్స్ మేనేజర్ శ్రీకాంత్ నుంచి రూ. 50 లక్షల నగదు ఉన్న బ్యాగును చోరీ చేశారు దుండగులు. రేతి బౌలి ఎక్స్ రోడ్‌లోని పిల్లర్ నంబర్ 28 సమీపంలో రాత్రి 11:30 సమయంలో చోరీ చేశారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఐదుగురు దొంగలని అరెస్ట్ చేశాం.  హరి ప్రీత్ సింగ్, మంప్రీత్ సింగ్, గుర్జీత్ సింగ్, అబ్బు, శ్రవణ్ ఐదుగురు కలిసి చోరీ చేశారు. 

ఈరోజు చోరీ చేసిన ఐదుగురు దొంగల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 43 లక్షల 80 వేల నగదు రికవరీ చేశాం.  చోరీ చేసిన డబ్బులతో ఐఫోన్లు కొనుగోలు చేశారు.  చోరీకి ప్లాన్ వేసిన శ్రవణ్ గతంలో అదే జువెలరీ షాప్ లో పనిచేసి మానేశాడు. రోజు జువెలరీ షాప్ మూసివేసిన తర్వాత నగదుతో  శ్రీకాంత్ ఏ రూట్ లో వెళ్తాడని సమాచారాన్ని నిందితులకు సమాచారం అందించాడు శ్రవణ్.ఈ రోజు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నామని తెలిపారు పోలీసులు.