మేడ్చల్ మల్కాజ్ గిరి: పేట్ బహీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 8లక్షల50వేల విలువైన 17 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితుల అరెస్ట్ పై పేట్ బషీరాబాద్ లోని మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ శబరీష్ వివరాలు వెల్లడించారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ కు చెందిన మహేష్(23), అమీర్ (29), రాజు (27) ముగ్గురు కలిసి బైక్ దొంగతనాలకుపాల్పడుతున్నారు. బుధవారం ( డిసెంబర్ 20) పేట్ బషీరాబాద్ పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. గతంలో కూడా దొంగతనాలు చేసి జైలు వెళ్లారు. వీరిపై ఇంతకుముందే 16 కేసులు నమోదు అయ్యాయని డీసీపీ తెలిపారు.