యైటింక్లయిన్ కాలనీ, వెలుగు: గోదావరిఖని టూ టౌన్ పీఎస్ పరిధిలోని న్యూ మారేడుపాక గ్రామంలో దుప్పి మాంసం అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సీఐ రవీందర్ వివవరల ప్రకారం బల్దియా 19వ డివిజన్ న్యూమారేడుపాక గ్రామంలో కొంతమంది వ్యక్తులు దుప్పిని చంపి మాంసం అమ్ముతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు సోదాలు చేపట్టారు.
న్యూమారేడుపాకకు చెందిన లొకిని మల్లేశ్, గంట మోహన్, సంతోష్ నగర్ కు చెందిన బండారి సురేందర్.. రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్లు సీఐ తెలిపారు. వీరితోపాటు దుప్పి తల, కాళ్లు, మాంసం స్వాధీనం చేసుకొని ఫారెస్ట్ అధికారులకు అప్పగించినట్లచెప్పారు.