దుండగులను పట్టించిన పట్టించిన ఫోన్ పే.. భూలక్ష్మి ఆలయం యాసిడ్ దాడి ఘటనలో ఇద్దరు అరెస్ట్...

దుండగులను పట్టించిన పట్టించిన ఫోన్ పే..  భూలక్ష్మి ఆలయం యాసిడ్ దాడి ఘటనలో ఇద్దరు అరెస్ట్...

మార్చి 14న సైదాబాద్ లోని భూలక్ష్మి ఆలయంలో అకౌంటెంట్ పై యాసిడ్ దాడి జరిగిన సంగతి తెలిసిందే.. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఆదివారం ( మార్చి 16 ) ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.బాధితుడు నర్సింగ్ రావు ఫిర్యాదు మేరకు ఆరు బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సుమారు 400 సీసీటీవీ కెమెరాలను సమీక్షించి నిందితుడిని పట్టుకున్నట్లు తెలిపారు. యాసిడ్ దాడి చేసిన నిందితుడిని రాయికోడ్ హరిపుత్ర గా గుర్తించామని తెలిపారు పోలీసులు.

దాడికి ముందు నిందితుడు గాంధీభవన్ మెట్రో స్టేషన్‌లో టోపీ కొన్నాడని.. ఇందుకు ఫోన్ పే ద్వారా డబ్బులు పే చేసినట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. ఆ ట్రాన్సాక్షన్ ద్వారా నిందితుడి ఫోన్ నెంబర్ సేకరించామని.. నిందితుడు హరిపుత్ర ను షేక్పేట్ లోని అతని నివాసంలో అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు. భూలక్ష్మి ఆలయంలో పనిచేసే పూజారి రాజశేఖర్ శర్మ ఆదేశాల మేరకు తాను యాసిడ్ దాడి చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని తెలిపారు పోలీసులు. దీంతో రాజశేఖర శర్మనుకూడా అదుపులోకి తీసుకున్నామని తెలిపారు పోలీసులు.

Also Read:-పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో 2 లక్షల ఇళ్లు ఇవ్వలేదు..

యాసిడ్ దాడి చేయడానికి హరిపుత్రతో రాజశేఖర్ శర్మ రూ.2 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలిపారు పోలీసులు. నర్సింగరావు ఆలయంలో రసీదు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని.. గుడికి వచ్చే పిల్లలను దూషిస్తున్నాడని.. దాడికి వివిధ కారణాలను రాజశేఖర్ శర్మ చెబుతున్నాడని అన్నారు పోలీసులు. 

మార్చి 14న నర్సింగ్ రావు గుడిలో  కూర్చుని ఉండగా ముసుగు ధరించిన వ్యక్తి నర్సింగ్ రావు వద్దకు తాను నరేష్ గా పరిచయం చేసుకున్నాడు.అన్నదానం గురించి నర్సింగ్ రావు వద్ద నిందితుడు సమాచారం అడిగి.. అదే సమయంలో అకస్మాత్తుగా హోలీ శుభాకాంక్షలు అంటూ నర్సింగ్ రావుపై  యాసిడ్ దాడి చేసి పారిపోయాడు. ప్రస్తుతం బాదితుడు మలక్‌పేటలోని యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.