రాజన్న సిరిసిల్ల జిల్లా మస్తాబాద్ లో వినూత్నరీతిలో పేకాటస్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో సిరిసిల్ల రూరల్ సిఐ మొగిలీ ముస్తాబాద్ పోలీసులతో కూలీల వేషంలో వెళ్లి దాడులు చేశారు. డబ్బులు , సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దర్ని అరెస్ట్ చేశారు.
ఇకపై జిల్లాల్లో ఇల్లీగల్ దందాలు, ఇల్లీగల్ యాక్టివిటీలపై పోలీసుల నజర్ ఉంటుందని.. మారువేశాల్లో వచ్చి దాడులు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.