ఈజీ మనీకోసం..కాలేజీ స్టూడెంట్సే టార్గెట్గా గంజాయి దందా

ఈజీ మనీకోసం..కాలేజీ స్టూడెంట్సే టార్గెట్గా గంజాయి దందా
  • ఇద్దరి అరెస్ట్, 9 కిలోల సరకు సీజ్

చాంద్రాయణగుట్ట, వెలుగు:బండ్లగూడలో ఓ కాలేజీ వద్ద స్టూడెంట్స్​కు గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాకు చెందిన చందన్ మాగి (36)  బీజాయ తక్రి (51)  ఈజీమనీ కోసం సిటీకి గంజాయి తెచ్చి అమ్ము తున్నారు. 

పక్కా సమాచారంతో వీరిని బుధవారం మధ్యాహ్నం సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్, బండ్లగూడ పోలీసులు కలిసి పట్టుకున్నారు. నిందితుల నుంచి 9 కిలోల గంజాయి,  రెండు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ శ్రీనివాసరావు తెలిపారు.

30 కేజీల గంజాయి సీజ్

వికారాబాద్:వికారాబాద్​ జిల్లాలో మంగళవారం సాయంత్రం రెండు గంజాయి కేసులు నమోదయ్యాయి. తాండూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి గంజాయి అమ్ముతున్నాడన్న సమాచారంతో జిల్లా ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు.

 ఒడిశాకు చెందిన  శిభారం స్వైన్​ను అరెస్టు చేసి, 2 కేజీల ఎండు గంజాయిని సీజ్ చేశారు. అలాగే తాండూరులో గుర్తు తెలియని వ్యక్తి దాచి ఉంచిన16 కేజీల ఎండు గంజాయి, 2 కేజీల పౌడర్​ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్
 విజయభాస్కర్​తెలిపారు.