విజయవాడలో గత శనివారం సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఘటన జరిగిన తర్వాత శరవేగంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని విచారించగా సతీష్ అనే యువకుడు తానే దాడికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. వేముల దుర్గారావు అనే వ్యక్తి మసతిష్ కి సహకరించినట్లు గుర్తించారు పోలీసులు. దుర్గారావు స్థానిక టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ అనుచరుడు కావటం గమనార్హం.
నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కాసేపట్లోనే కోర్టు ఎదుట హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దాడి వెనక టీడీపీ కుట్ర దాగి ఉందన్న వైసీపీ శ్రేణుల ఆరోపణలకు బలం చేకూర్చుతోంది ఈ అరెస్ట్. మరి, ఈ అరెస్ట్ పై కోర్టు ఏ రకంగా స్పందిస్తుంది, వైసీపీ విమర్శలను టీడీపీ ఎలా తిప్పి కొడుతుంది వంటి అంశాలు తెలియాలంటే వేచి చూడాలి.