రాజేంద్రనగర్‌లో బైక్ రేసింగ్.. ఖరీదైన బైక్ లు సీజ్

రాజేంద్రనగర్‌లో బైక్ రేసింగ్.. ఖరీదైన బైక్ లు సీజ్

రంగారెడ్డి జిల్లా : వీకెండ్ కావడంతో హైదరాబాద్ శివారులో బైక్ రేసింగ్ నిర్వహిస్తున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేసర్లు మితిమీరిన వేగంతో రాజేంద్రనగర్ లో బైక్ రేసింగ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఖరీదైన స్పోర్ట్స్ బైక్స్ తో రోడ్డుపై రయ్ రయ్ మంటూ వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ రోడ్డుపై వెళ్లే వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. డైరీ ఫామ్ దగ్గర ఆరు స్పోర్ట్స్ బైక్స్ ను అడ్డుకొని ట్రాఫిక్ పోలీసులు బైక్ లను సీజ్ చేశారు. బైక్ లను ట్రాఫిక్ పోలీసులు పరిశీలించారు.