ప్లాన్ ప్రకారమే రాజలింగమూర్తి హత్య.. నిందితుల్లో మాజీ ఎమ్మెల్యే అనుచరుడు

ప్లాన్ ప్రకారమే రాజలింగమూర్తి హత్య.. నిందితుల్లో  మాజీ ఎమ్మెల్యే అనుచరుడు

| జయశంకర్ భూపాలపల్లి:  తెలంగాణలో సంచలనంగా మారిన భూపాలపల్లి రాజలింగమూర్తి  మర్డర్ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.  ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో భూపాలపల్లి మాజీ వైస్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ప్రధాన అనుచరుడు కొత్త హరిబాబు పాత్ర ఉన్నట్లు ధృవీకరించారు. హరిబాబు ప్లాన్ ప్రకారమే రాజలింగమూర్తిని హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. రాజలింగ మూర్తిని చంపితే బెయిల్ నేనే తీసుకొస్తా.. మీ ఖర్చులన్నీ నేనే చూసుకుంటాని నిందితుడు హరిబాబు చెప్పినట్లు తెలుస్తోంది. దాదాపు 5 నెలలుగా పాటు ప్లాన్ల్చేసి, హత్య చేసిన్న ట్లు సమాచారం. ఈ కేసులో ఏ8గా ఉన్న హరిబాబు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.అతన్ని అరెస్ట్  చేస్తే ఇంకొన్ని విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. 

భూపాలపల్లి రాజలింగ మూర్తి హత్య కేసుకు సంబంధించిన వివరాలను ఇవాళ ఎస్పీ కిరణ్ ఖరే మీడియాకు వివరించారు. రాజలింగమూర్తి హత్యకు భూ వివాదమే కారణమని తెలిపారు. ఎకరం భూమి కోసమే హత్యమార్చారని తెలిపారు. 'సంజీవ్, రాజలిం గమూర్తి మధ్య భూ వివాదం కొనసాగుతోంది. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశారు. కంట్లో కారం కొట్టి కత్తులతో పొడిచి హతమార్చారు. ఈ హత్యలో నలుగురు వ్యక్తులు నేరుగా పాల్గొన్నారు. మిగతా వాళ్లు వారితో టచ్లో ఉన్నారు. బీఆర్ఎస్ నాయకుడు హరిబాబు ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు గుర్తించాం. 

ALSO READ | కేసీఆర్పై కేసు పెట్టిన రాజలింగమూర్తి హత్య కేసులో వీడిన మిస్టరీ

ప్లాన్ ప్రకారం వరంగల్లోని కాశీబుగ్గలో హత్యకోసం కత్తులు, రాడ్లను దుండగులు కొనుగోలు చేశారు. ఇతర కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈ హత్య కేసులో 10 మంది నిందితుల్లో ఏడుగురిని అరెస్ట్ చేశాం. హరిబాబుతో పాటు మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ఆరు బృందాలతో కలిసి పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యల్లో ఉన్నారు.' అని చెప్పారు. ఈ కేసులో A1 రేణి గుంట్ల సంజీవ్.. హత్యకు ముందు, తర్వాత బీఆర్ఎస్ నాయకుడు హరిబాబుతో టచ్ ఉన్న ట్టు పోలీసులు నిర్ధారించారు. మాజీ ఎమ్మెల్యే సండ్రా వెంకటరమణారెడ్డికి హరిబాబు ప్రధాన అనుచరుడు. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న వారందరినీ అరెస్ట్ చేసి రిమాండుకు తరలించిన ట్టు ఎస్పీ తెలిపారు.