ఒడిశా నుంచి ముంబైకి గంజాయి తరలించే ప్లాన్.. జనగాంలో వ్యక్తి అరెస్ట్

ఒడిశా నుంచి ముంబైకి గంజాయి తరలించే ప్లాన్.. జనగాంలో వ్యక్తి అరెస్ట్
  • బచ్చన్నపేటలో గంజాయి కలకలం
  • ఒడిశా నుంచి ముంబైకి రైలులో తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ 
  • 19 కిలోల గంజాయి పట్టుకున్న జనగామ జిల్లా పోలీసులు


బచ్చన్నపేట,వెలుగు:  ఓ వ్యక్తి గంజాయి తీసుకెళ్తూ జనగామ జిల్లా పోలీసులకు పట్టుబడ్డాడు. బచ్చన్నపేట పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశాలోని గజపతి జిల్లా సబల్పూర్​గ్రామానికి చెందిన నభా కిశోర్ ​పాయక్​ బుధవారం 9 ప్యాకెట్లలో  రూ.4.75 లక్షల విలువైన 19 కిలోల ఎండు గంజాయిని ముంబైకి  రైలులో తీసుకెళ్తున్నాడు. 

జనగామకు వెళ్లగానే అతడు  పోలీసులను చూసి భయపడి రైలు దిగి పారిపోయి  ఆటోలో వచ్చి తమ్మడపల్లి బస్టాండ్​వద్ద దిగాడు.  ముందస్తు సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లగా కిశోర్ పరుగు తీస్తుండగా వెంబడించి పట్టుకొని విచారించగా గంజాయి బయట పడింది. నిందితుడిపై  కేసు నమోదు చేసి దర్యాప్పు చేస్తున్నట్లు ఎస్ఐ హమీద్​తెలిపారు.