లక్ష రూపాయలకు 5 ఎకరాల భూధాన్ భూమి సర్టిఫికేట్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భూదాన్ భూమి నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను ఏస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం సీఐ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఇబ్రహీంపట్నం మండలం నాగన్ పల్లికి చెందిన చిన్నరావుల శ్రీశైలం, యాచారం మండలం మొండి గౌరెల్లీకి చెందిన ఏట్టి లింగంయ్యాకి చెందిన నెట్ సెంటర్ లో ఫేక్ భూదాన్ సర్టిఫికేట్ తయారు చేస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. వీరు లక్ష రూపాయలకు 5 ఎకరాల భూధాన్ భూమి సర్టిఫికేట్ తయారు చేసి పాస్ బుక్కులు ఇస్తామని నమ్మించి.. పలువురి వద్ద డబ్బులు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 

వీరిద్దరిపై గతంలో ఆదిభట్ల, మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు కాగా.. తాజాగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ సర్టిఫికేట్ తయారు చేస్తుండగా పోలీసలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.  నిందితుల నుండి నకిలీ సర్టిఫికెట్లు, కంప్యూటర్, మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ రోజు రిమాండ్ కి తరలించారు.