- రూ.లక్ష విలువజేసే లిక్కర్ బాటిళ్ల సీజ్
లింగంపేట,వెలుగు : లింగంపేట మండలం మోతెలోని బెల్ట్‌షాప్‌పై పోలీసులు శనివారం రాత్రి దాడి చేసి రూ.లక్ష విలువజేసే మద్యం బాటిళ్లను సీజ్‌చేశారు. నిర్వాహకుడు బద్ధం ప్రతాప్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చైతన్యరెడ్డి తెలిపారు. బెల్ట్‌షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్ఐ వెంట కానిస్టేబుళ్లు రామస్వామి, రవి ఉన్నారు.