
- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడి ఇంట్లో పోలీసుల సోదాలు
- 700కు పైగా చీరలు స్వాధీనం
- బతుకమ్మ పండుగకు పంచగా మిగిలాయన్న వెరబెల్లి
- బీజేపీపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్న రఘునాథ్‌రావు
మంచిర్యాల, వెలుగు : బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు ఇంట్లో ఆది వారం రాత్రి పోలీసులు సోదాలు చేశారు. టౌన్‌సీఐ ముష్కె రాజు, ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో రాత్రి 11 గంటలకు పట్టణంలోని హైటెక్‌సిటీలో రఘునాథ్ నివాసంతో పాటు బంధువుల ఇండ్లలో తనిఖీలు జరిపారు. చీరలు పంచుతున్నారని ఫిర్యాదు రావడంతో సోదాలు చేసి 700కు పైగా చీరలు స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.
కోడ్‌కు ముందు రఘునాథ్ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంచారు. కోడ్ వచ్చిన తర్వాత పంపిణీ నిలిపివేసి మిగిలిన చీరలను ఓ గదిలో ఉంచి తాళం వేశారు. అయినప్పటికీ ఆ చీరలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, పోలీసులు, ఎలక్షన్అధికారులు కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్లను వదిలిపెట్టి బీజేపీపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని రఘురాథ్ వెరబెల్లి ఆరోపించారు.