కోడిపందేల స్థావరంపై పోలీసులు దాడి

అశ్వారావుపేట, వెలుగు: కోడిపందేల స్థావరంపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. మండలంలోని నారంవారిగూడెం గ్రామ శివారులోని గల ఓ తోటలో కోడిపందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఎస్సై శ్రీరాముల శ్రీను సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో రూ. 9,800 నగదుతో పాటు 10 పందెం కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. పట్టుబడిన పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.