గుడుంబా స్థావరాలపై దాడులు

  • 1900 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
  • 15 లీటర్ల నాటుసారా స్వాధీనం

బెల్లంపల్లి రూరల్, వెలుగు: నెన్నెల మండలంలోని చిన్న, పెద్దలంబాడి తండాల శివారులో నడుపుతున్న గుడుంబా స్థావరాలపై శుక్రవారం చెన్నూర్​ఎక్సైజ్, నెన్నెల పోలీసులు దాడులు నిర్వహించారు. మామిడి తోటల్లో డ్రమ్ములలో పాతిపెట్టిన 1900 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. 15 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని చిన్నతండాకు చెందిన తయారీదారులు ధరావత్​తిరుమల్, ధరావత్​ దేవేందర్​పై కేసులు నమోదు చేసినట్లు చెన్నూర్​ఎక్సైజ్​ సీఐ హరి చెప్పారు. గుడుంబా తయారు చేసినా, అమ్మినా కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ దాడుల్లో ఎన్​ఫోర్స్​మెంట్​ఆదిలాబాద్​ సీఐ గంగారెడ్డి, మంచిర్యాల టాస్క్​ఫోర్స్​ సీఐ సమ్మయ్య, బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలోద్దీన్​, నెన్నెల ఎస్​ఐ ప్రసాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, చెన్నూర్ ​ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు.