ఆదివారం బిగ్ బాస్ ఫైనల్ జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో బిగ్ బాస్ షో నిర్వాహకులు ఈ ఈవెంట్ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ బిగ్ బాస్ షో ఫైనల్ ఈవెంట్ కి టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా వస్తున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పోలీసులు కూడా అన్నపూర్ణ స్టూడియో వద్ద భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఇందిరా నగర్, కృష్ణా నగర్ నుంచి అన్నపూర్ణ స్టూడియో వద్దకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించినట్లు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. అలాగే ఎలాంటి న్యూసెన్స్ జరిగినా బాధ్యత మీదే అంటూ బిగ్ బాస్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే ఈవెంట్ పూర్తయిన తర్వాత పెద్ద ఎత్తున జనాలు గుమిగూడి ఉండటం, ర్యాలీలు నిర్వహించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అయితే గతంలో గత సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ షో నుంచి బయటికొచ్చిన సమయంలో కారుపై రాళ్లు విసరడం, తొక్కిసలాటలు, ఫ్యాన్స్ మధ్య గొడవలు జరగడం వంటి సంఘటనలు జరిగాయి. దీంతో ఈసారి పోలీసులు ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఇప్పటికే దాదాపుగా 200 మంది పోలీసులను భద్రత కోసం కేటాయించినట్లు సమాచారం.