సరూర్ నగర్ కిడ్నీరాకెట్ దందా.. ప్రధాన నిందితుడు విదేశాలకు పరార్.!

సరూర్ నగర్ కిడ్నీరాకెట్ దందా.. ప్రధాన నిందితుడు విదేశాలకు పరార్.!

హైదరాబాద్  సరూర్‌నగర్ అలకనంద ఆస్పత్రి కిడ్నీ రాకెట్ కేసు విచారణ వేగవంతం చేశారు పోలీసులు.ఈ కేసులో ప్రధాన నిందితుడు పవన్ విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పటికే  ఇద్దరిని కస్టడీకి తీసుకుని విచారించారు.  ఆస్పత్రి ఛైర్మన్ సుమంత్, మరో డాక్టర్ అవినాశ్‌ను విచారించారు. ఇవాళ( ఫిబ్రవరి 17న) విశాఖకు చెందిన డా. రాజశేఖర్‌ విచారించారు పోలీసులు.

2025 జనవరి 21న  కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.. సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలోని అలకనంద హాస్పిటల్‎లో ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కొనసాగిస్తున్న కిడ్నీ మార్పిడిని పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలకు డబ్బు ఆశ చూపి.. పక్క రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్లను తీసుకొచ్చి సైలెంట్‎గా కిడ్ని మార్పిడి శస్త్ర చికిత్సలు చేశారు. 

ఒక్కొ కిడ్నికి రూ.55 లక్షలు బేరం కుదుర్చుకుని.. అందులో కిడ్ని ఇచ్చిన డోనర్లకు కేవలం రూ.5, 10 లక్షలే ఇస్తున్నట్లు తేల్చారు పోలీసులు. మిగిలిన డబ్బుంతా మధ్యవర్తులు, డాక్టర్లు, ఆసుపత్రి నిర్వహకులు మింగేస్తున్నట్లు గుర్తించారు.   వైద్యాధికారులు అలకనంద ఆసుపత్రిని సీజ్ చేశారు.  డ్ని రాకెట్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర సర్కార్.. ఈ కేసును సీఐడీకి అప్పగించింది. ఈ మొత్తం వ్యవహారంలో పవన్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించాడు అతను దొరికితే పూర్తి వివరాలు బయటకొస్తాయి.