భద్రాద్రికొత్తగూడెం/భద్రాచలం/మణుగూరు, వెలుగు : పోలీస్అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వేర్వేరు చోట్ల బ్లడ్డొనేషన్క్యాంపులు నిర్వహించారు. కొత్తగూడెం ఐఎంఏ హాల్లో నిర్వహించిన శిబిరంలో ఓఎస్డీ టి.సాయి మనోహర్ పాల్గొన్నారు. పోలీసులతోపాటు పలువురు యువకులు కలిపి 120 మంది బ్లడ్డొనేట్చేశారు. వారికి ఓఎస్డీ సాయి ఫ్రూట్స్ఇచ్చారు.
ఏఆర్అడిషనల్ ఎస్పీ విజయబాబు, డీఎస్పీ రెహమాన్, సీఐలు నాగరాజు, పెద్దన్న కుమార్, కరుణాకర్, మురళి, రమేశ్పాల్గొన్నారు. అలాగే భద్రాచలంలో నిర్వహించిన క్యాంప్‌లో స్థానిక ఏఎస్పీ పంకజ్పరితోశ్, సీఐ నాగరాజురెడ్డి, ఎస్సైలు, సిబ్బంది బ్లడ్డొనేట్చేశారు. మణుగూరు క్యాంప్‌లో స్థానిక డీఎస్పీ ఎస్.వి.రాఘవేంద్రరావు, సీఐ రమాకాంత్, ఎస్సై రాజేశ్‌కుమార్, స్థానికులు బ్లడ్ఇచ్చారు.