
ముంబై : సుకేష్ గుప్తా.. ముంబైలోని శివ్షాహీ ఏరియాలో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. రోజుకు 50 మంది పేషెంట్లు అతని వద్ద ట్రీట్మెంట్ కోసం వస్తుంటారు. నాలుగేళ్ల పాటు అంతా సజావుగా సాగింది. చివరకు పాపం పండింది. ఎలాంటి పట్టా లేకుండా తన వైద్యంతో జనాన్ని మోసం చేస్తున్న ఆ నకిలీ డాక్టర్ బండారాన్ని పోలీసులు బయటపెట్టారు.
ముంబైకి చెందిన సుకేష్ గుప్తా ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. కొంతకాలం ఏ పని లేకుండా తిరిగిన ఆయన.. డబ్బు సంపాదన కోసం ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. డాక్టర్ అవతారమెత్తి ఎలాంటి లైసెన్స్ లేకుండా నాలుగేళ్లుగా జనానికి వైద్యం చేస్తున్నాడు. ఈ విషయం ముంబై పోలీసులు, బీఎంసీ అధికారుల దృష్టికి రావడంతో వారు రంగంలోకి దిగారు. జాయింట్ ఆపరేషన్ నిర్వహించి నకిలీ డాక్టర్ గుట్టు రట్టు చేశారు. పోలీసులు విచారణలో తాను ఇంటర్ ఫెయిల్ అయినట్లు సుకేష్ అంగీకరించాడు. తన వద్దకు నిత్యం 50 మంది వరకు పేషెంట్లు వస్తారని చెప్పాడు. ఎలాంటి అర్హతలేకున్నా తన వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన సుఖేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని క్లినిక్ నుంచి మెడిసిన్స్తో పాటు ఇతర వైద్య పరికరాలు సీజ్ చేశారు.
Mumbai | In a jt op, Police & BMC officials arrested a man Sukesh Gupta who was practicing medicine without a license for past 4 yrs in Shivshahi area. He revealed that he had failed class 12th exams & used to attend to around 50 patients daily. Medicines & other equipment seized pic.twitter.com/6BFBs2rg1Z
— ANI (@ANI) March 21, 2022