కొబ్బరి బొండాల ముసుగులో గంజాయి వ్యాపారం

కొబ్బరి బొండాల ముసుగులో గంజాయి వ్యాపారం

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గంజాయి ముఠా ఆట కట్టించారు పోలీసులు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 900కిలోల గంజాయిను స్వాధీనం చేసుకుని.. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా కొబ్బరి బొండాల ముసుగులో ఒడిస్సా రాష్ట్రం మల్కన్ గిరి నుండి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా ఎల్బీనగర్, ఆలేరు ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. 

మహారాష్ట్రకు చెందిన యోగేష్ దత్ అనే వ్యక్తి గత కొంతకాలంగా మల్కన్ గిరి నుండి మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నాడని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఒడిస్సా రాష్ట్రంలో కేజీ గంజాయిని 2 నుంచి 3 వేల రూపాయలకు విక్రయించి.. మహారాష్ట్రలో సుమారు రూ.15 వేలకు అమ్ముతున్నారని తెలిపారు. నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో వికాస్, వినోద్, కిషోర్, చిట్టిబాబు అనే వ్యక్తులు ఉన్నారు.