కల్తీ పాలు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

భూదాన్ పోచంపల్లి మున్సిపాల్టీలోని ఇంద్రియాల గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్నం ప్రభాకర్​ అనే వ్యక్తి కొంతకాలంగా చుట్టుపక్కల గ్రామాల్లో పాలు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. అయితే ప్రభాకర్ కల్తీ పాలు తయారు చేస్తున్నడన్న సమాచారంతో ఇవాళ ఉదయం అతడి ఇంటిలో ఎస్ఓటీ పోలీసులు తనిఖీ చేశారు. పాలను కల్తీ చేస్తున్నట్లుగా గుర్తించారు. అతడి వద్ద 200 లీటర్ల కల్తీ పాలు, లీటర్ హైడ్రోజన్ పెరాక్సైడ్, కేజీ వారమ్ స్కిన్డ్ మిల్క్ పౌడర్​ను స్వాధీనం చేసుకొని.. ఎస్​ఐ సైదిరెడ్డికి అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. పాలను టెస్టింగ్​ కోసం ల్యాబ్‌‌కు పంపారు.