టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టీమ్ పై కేసు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. అయితే అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ కి వచ్చాడు. సుదీంతో దీంతో ఫ్యాన్స్ పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి నేర్ మహిళ మృతి చెందగా బాలుడు తీవ్ర అస్వస్థతకి గురయ్యాడు.
దీంతో సంధ్య థియేటర్ ఘటనపై చిక్కడపల్లి పోలీసుల కేసు నమోదు చేశారు. ఇందులోభాగంగా సెక్షన్ 105,118 BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ థియేటర్ కు వస్తున్న సందర్భం లో సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందంటూ అభియోగాలు మోపారు.
అలాగే అల్లు అర్జున్ వస్తున్న విషయం పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీం పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.