హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు మరికొందరిపై జూబ్లీహిల్స్ పీఎస్లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రోడ్ నం 69 నందగిరిహిల్స్లో జీహెచ్ఎంసీకి చెందిన ప్రభుత్వ స్థలం ప్రహరీని ఈ నెల 10న కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కూల్చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు గుర్తించారు.
ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలో గురుబ్రహ్మనగర్కి చెందిన గోపాల్ నాయక్, రాంచందర్ తదితరులు కూల్చివేత ఘటనలో ఉన్నారని ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఛార్జ్ పాపయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రహరీ కూల్చివేతతో రూ.10 లక్షల మేరకు నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో ఎమ్మెల్యే దానం నాగేందర్ను పోలీసులు A3 గా చేర్చారు.