సుచిర్ ఇండియా ఎండీ కిరణ్ పై కేసు : లెక్కల్లో తేడా వచ్చిందని అకౌంటెంట్ పై ఆఫీసులోనే దాడి

సుచిర్ ఇండియా ఎండీ కిరణ్ పై కేసు : లెక్కల్లో తేడా వచ్చిందని అకౌంటెంట్ పై ఆఫీసులోనే దాడి

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సుచిర్ ఇండియా ఎండీ కిరణ్ పై హైదరాబాద్ లోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. లెక్కల్లో తేడాలు వచ్చాయంటూ తన సంస్థలో పని చేసే అకౌంటెంట్ ను గదిలో నిర్బంధించి దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు  అకౌంటెంట్ ప్రియాంక్. మంగళవారం ( మార్చి 18 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. గత రెండు నెలలుగా సుచిర్ ఇండియాలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు ప్రియాంక్. ఈ క్రమంలో లెక్కల్లో రూ. 5లక్షలు తేడా వచ్చాయంటూ ప్రియాంక్ ను తన గదిలోకి పిలిచారు ఎండీ కిరణ్.

ప్రియాంక్ ను గదిలో నిర్బంధించిన కిరణ్ లెక్కల్లో తేడా ఎందుకు వచ్చిందని.. ఆ రూ. 5లక్షలు ఎక్కడ.. డబ్బులు కట్టకపోతే అంతు చూస్తానంటూ దాడి చేసారు కిరణ్. ప్రియాంక్ ను రోజంతా గదిలోనే నిర్బందించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కిరణ్ బయటికి వెళ్లిన సమయంలో ప్రియాంక్ 100కు కాల్ చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి అతడిని రక్షించినట్లు సమాచారం. ప్రియాంక్ ఫిర్యాదు మేరకు కిరణ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.