మేడిగడ్డ డ్యామేజ్ పై పోలీస్ కేసు : కుట్ర కోణంపై విచారణకు కంప్లయింట్

జయశంకర్ భూపాలపల్లి : మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన ఘటనలో పోలీసులకు ఫిర్యదు చేశారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు. దీని వెనకాల కుట్రకోణం ఏమైనా దాగుందా అనే కోణంలో విచారణ చేపట్టాలని మహదేవ్ పూర్ పోలీసులకు AEE రవికాంత ఫిర్యాదు చేశారు. 427ipc సెక్షన్ 3 of PDPP act సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన మహాదేవపూర్  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్టోబర్ 21 న సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు పెద్ద శబ్దం వచిందంటున్న ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. 7 బ్లాక్ వద్ద  19,20,21 పిల్లర్లు కుంగినట్టు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదులు తెలిపారు. 

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలున్నాయని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దీనిపై కేంద్రానికి లేఖరాశారు.  కిషన్ రెడ్డి లేఖపై స్పందించిన కేంద్రం జలవనరుల సంఘం.. చైర్మన్ అనిల్ జైన్ ఆధ్వర్యంలో టీం ను డ్యామ్ పరిశీలించి విచారణ చేపట్టేందుకు రాష్ట్రానికి పంపింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడంపై విచారణ చేపట్టారు.

ALSO READ:  మేడిగడ్డ బ్రిడ్జి ఘటన: కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనానికి బస్సులు ఏర్పాటు చేస్తాం