కీసరలో 36 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

కీసరలో 36 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో అక్రమంగా తరిలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్నారు పోలీసులు. కీసర పోలీస్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెం 8 వద్ద 36 టన్నుల రేషన్ బియ్యాన్ని ఓ లారిలో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్ చేశారు. రేషన్ బియ్యం తరలిస్తున్న ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్ట్ చేశారు.మరికొంత మంది ముఠా సభ్యులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మహారాష్ట్రకు చెందిన నంబర్ ప్లేట్ తో ఉన్న లారీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు.  తెలంగాణనుంచి మహారాష్ట్రకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు తెలుస్తోంది.