నంబర్ ప్లేట్ ఒకటి..లారీ మరొకటి

నంబర్ ప్లేట్ ఒకటి..లారీ మరొకటి
  •     కామారెడ్డికి ఇసుక తరలిస్తూ పట్టుబడిన లారీ

వేములవాడ, వెలుగువ : ఇసుక రవాణాకు అనుమతి పొందిన ఒక లారీ నంబర్‌‌‌‌‌‌‌‌ప్లేట్​ను మరోదానికి తగిలించి ఇసుక రవాణా చేస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి..  బోయినిపల్లి మండలం నీలోజిపల్లికి చెందిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి లారీ సర్వీస్ అనుముల భాస్కర్(బీఆర్ఎస్​ నేత) పేరుతో ఉన్న లారీ నంబర్​TG23T0459పై భూపాలపల్లి జిల్లా మహదేవ్​పూర్ మండలం నంచి 35 మెట్రిక్ టన్నుల ఇసుక తరలించేందుకు పర్మిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్నారు. కాగా అనుమతి పొందిన నంబర్ ప్లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరో లారీకి తగిలించి బుధవారం కామారెడ్డికి ఇసుక తరలిస్తున్నారు. 

వేములవాడ నంది కమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద పెట్రోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులు లారీని పట్టుకున్నారు. అనుమానంతో వివరాలు ఆరా తీయగా ఇసుక దందా బయటపడింది. కొన్నాళ్లుగా మాజీ సీఎం బంధువు సహకారంతో ఒక్క లారీకి పర్మిషన్ తీసుకొని పదుల సంఖ్యలో వే బిల్లులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్లు తెలిసింది. జిల్లా సరిహద్దులు దాటేదాకా లారీల వెంట కార్లలో వెంబడిస్తూ, జిల్లా దాటాక ఆ నంబర్లను తీసుకొచ్చి వేరే లారీలకు తగిలిస్తూ దందా కొనసాగిస్తున్నారు. 

ఈ దందాలో కొంత మంది పోలీసులు, ప్రభుత్వ అధికారుల సహకారం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. లారీ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్చి ఇసుక తరలిస్తున్న డ్రైవర్​ రామ్​సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యజమాని అనుముల భాస్కర్​పై కేసు నమోదు చేసినట్లు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి సీఐ శ్రీనివాస్​ తెలిపారు.