ఆదివారం ( మార్చి 23 ) ఉప్పల్ లో SRH మ్యాచ్.. భారీగా బ్లాక్ టికెట్లు స్వాధీనం

ఆదివారం ( మార్చి 23 ) ఉప్పల్ లో SRH మ్యాచ్.. భారీగా బ్లాక్ టికెట్లు స్వాధీనం

క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ వచ్చేసింది.. ఐపీఎల్ సీజన్ 18 ఇవాళ ( మార్చి 22 ) ప్రారంభం కానుంది. కోల్కతా నైట్ రైడర్స్ ( KKR ), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB ) మధ్య జరిగే మ్యాచ్ తో ఈ సీజన్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా.. ఆదివారం ( మార్చి 23 ) హైదరాబాద్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH ), రాజస్థాన్ రాయల్స్ ( RR ) మధ్య మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం బ్లాక్ అమ్ముతున్నారు కేటుగాళ్లు. ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్ముతున్న భరద్వాజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఎస్ఓటీ పోలీసులు.

భరద్వాజ్ దగ్గర ఐపీఎల్ బ్లాక్ టికెట్లు స్వాధీనం చేసుకున్న ఎస్ఓటీ.. ఉప్పల్ పోలీసులకు అప్పగించారు.కాగా.. నేడు రాయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెంగళూరు, కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రైడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగే తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఓపెనింగ్ సెర్మనీ ఘనంగా జరగనుంది. 

Also Read : ఐపీఎల్ సందడి మొదలు.. KKR, RCB మ్యాచ్.. గెలిచే ఛాన్స్ ఎవరికి ఎక్కువ ఉందంటే..

చెరో ఐదుసార్లు చాంపియన్లుగా నిలిచిన చెన్నై, ముంబైతో పాటు ఇతర జట్లు కూడా ఈసారి తమ సత్తా చూపేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా 10 జట్లు.. 65 రోజులు.. 74 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో.. 13 నగరాలకు మినీ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పండగ రాగా.. ప్రపంచ వ్యాప్తంగా ఉండే క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కనువిందు చేసేందుకు స్వదేశీ,విదేశీ స్టార్లు కూడా రెడీ అయ్యారు.