కబేళాకు తరలిస్తున్న గోవులను పట్టుకున్న పోలీసులు

మునగాల, వెలుగు: కబేళాకు తరలిస్తున్న తొమ్మిది గోవుల వాహనాన్ని మునగాల పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా నేషనల్ హైవేపై ఎస్సై అంజిరెడ్డి తమ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో కోదాడ నుంచి వస్తున్న బొలెరో గూడ్స్ వ్యాన్ లో 9 గోవులను రహస్యంగా హైదరాబాద్​లోని గోవధకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వాహనంలో ఉన్న డ్రైవర్ తోపాటు ఇద్దరు పరిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వాహనంతోపాటు ఇరువురిని స్థానిక పోలీస్ స్టేషన్​కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అంజిరెడ్డి తెలిపారు.