నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు.. నలుగురు అరెస్ట్

నకిలీ సర్టిఫికెట్ ముఠాను జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 395 నకిలీ సర్టిఫికెట్లు, 5 సెల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్, ఒక లాప్ టాప్, 25 వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రనికి చెందినవారని... కరీంనగర్ కి చెందిన  ఇద్దరు భార్య, భర్తలు జైనకు చెందిన వాసులని.. వారినిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలోని మరో ఇద్దరు నిందితులు పశ్చిమ బెంగాల్  రాష్ట్రానికి పరార్ అయినట్లు పేర్కొన్నారు. 

కరీంనగర్ కు చెందిన నిందితురాలు రజితకు  జస్ట్ డయల్ ద్వారా.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రబీ రాయ్ పరిచయమైయ్యాడని... అయితే రబీ రాయ్ ఫోన్ ద్వారా రజితకు నకిలీ సర్టిఫికెట్ల ఇస్తానని చెప్పిన విషయం చెప్పాడని... ధర్మంపూరి మండలం జైన గ్రామానికి చెందిన యువకుడు పాస్పోర్ట్ అవసరం నిమిత్తం సర్టిఫికెట్ల కోసం ఈ ముఠా ను సంప్రదించడని తెలిసిందని పేర్కొన్నారు పోలీసులు. 

ALSO READ ;-Gaami Box Office: గామి ఫస్ట్ డే క‌లెక్ష‌న్స్..విశ్వక్ కెరీర్లో ఇదే హయ్యెస్ట్‌‌!

అయితే రజిత సదరు యువకుడి నుంచి 30 వేల రూపాయల నగదు తీసుకొని పశ్చిమ బెంగాల్ కు చెందిన రబి రాయ్ కి అందించిందని.. నకిలీ సర్టిఫికెట్ తో జైనావాసి పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేయగా.. ఎస్బీ  విచారణలో నకిలీ సర్టిఫికెట్ వ్యవహారం గుట్టు రట్టయింది. ఈ నకిలీ సర్టిఫికెట్ల ముఠా ఒక్కో సర్టిఫికెట్ కు సుమారు 30వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూళ్లు చేస్తుందని పోలీసులు తెలిపారు.